MHBD: గూడూరు మండలంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు గుర్తించామని ఇన్ఛార్జ్ ఎంపీడీవో సత్య నారాయణ వెల్లడించారు. మండలంలోని 17 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానాలకు గాను 88 పోలింగ్ కేంద్రాలను స్థానిక రాజకీయ ప్రతినిధులతో చర్చించి ఎంపిక చేశామని తెలిపారు. 23,851 మంది పురుషులు, 24717 మంది మహిళలు, 2 ఇతరులు, మొత్తం 48,570 మంది ఓటర్లు జాబితాను రూపొందించామన్నారు.