ELR: కుక్కునూరు మండలంలోని దాచారం గుండేటి వాగుకు వరద మళ్ళీ చేరింది. గత వారం రోజుల క్రితం వరద తగ్గి రాకపోకలు కొనసాగాయి. వర్షాల కారణంగా శనివారం గుండేటి వాగుకి వరద చేరడటంతో ప్రస్తుతం రాక పోకలు నిలిచి పోయాయి . అయితే మండల కేంద్రానికి ప్రజలు చుట్టూ తిరిగి 10 కి.మీ అదనంగా ప్రయానించాల్సిన పరిస్థితి ఏర్పడింది.