SRD: గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీని పగలగొట్టి దొంగతనం చేసిన ఘటన మండల కేంద్రమైన కంగ్టిలో చోటుచేసుకుంది. శనివారం స్థానికులు తెలిపిన వివరాలు.. కంగ్టిలో ఊరి చివర ఉన్న హనుమాన్ మందిరంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో చొరబడి హుండీ తాళం పగలగొట్టారు. అందులోని నగదును అపహరించారని చెప్పారు. విషయాన్ని పోలీసులకు తెలిపారు.