SRPT: కోదాడ పట్టణానికి చెందిన తన్వి నటరాజ్ డాన్స్ అకాడమీ విద్యార్థులు భరతనాట్యంలో 12 ప్రపంచ రికార్డులు సాధించినట్లు నాట్య గురువు తిరుపతి స్వామి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాశీలో నిర్వహించిన శాస్త్రీయ నృత్య పోటీల్లో రావణ కృత శివతాండవం నృత్య ప్రదర్శనలో ఈ ఘనత సాధించినట్లు ఆయన తెలిపారు.