MNCL: మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఈ నెల 15న వందే భారత్ ఎక్స్ ప్రెస్ హాల్టింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8.15 గంటలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొంటారు.