ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మొదటి దశగా విడుదలైన ఇందిరమ్మ ఇళ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, చాలా చోట్ల గృహ ప్రవేశాలు కూడా చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు.