మహబూబ్నగర్ కార్పొరేషన్ లోని పాత తోట పోచమ్మ గుడి ఆవరణలో రూ.15 లక్షల ముడా నిధులతో నిర్మించనున్న మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్ లోనూ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.