KNR: హుజురాబాద్ పట్టణంలో ప్రజల ఉపాధి, జీవన స్థితిగతులపై బుధవారం జాతీయ గణాంక శాఖ సర్వే ప్రారంభించింది. అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో 12 కుటుంబాలను ఎంపిక చేసి విద్య, వృత్తి, స్వయం ఉపాధి వివరాలను ట్యాబ్ ద్వారా నమోదు చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మేనేజర్ భూపాల్ రెడ్డి, తహసీల్దార్ కనకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.