AP: సూపర్ 6 హామీని సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుతమ్ముళ్ల స్పీడు.. జనసేన జోరు.. కమలదళం ఉత్సాహానికి ఎదురుందా? అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని తెలిపారు. జవాబుదారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వం తమది అని ఉద్ఘాటించారు. 2024లో కనీవినీ ఎరుగని రీతిలో తమను ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు.