KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి పాటుపడాలని కమిషనర్ నరసింహ రెడ్డి కోరారు. సోమవారం సాయంత్రం వార్డు సచివాలయ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సూచన చేశారు. పురమిత్ర, పురసేవ యాప్ల ద్వారా పన్నులు చెల్లించవచ్చని, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు.