KNR: యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. సన్న రకం వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామంటూ ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చకుండా రైతన్నను మోసం చేసిందన్నారు. యూరియా కొరతను తీర్చి, బోనస్ డబ్బులను తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు, నిరాహార దీక్షలు చేపడతామని అన్నారు.