W.G: ఆచంట నియోజకవర్గంలో అక్రమ ఇసుక మాఫియాను అడ్డుకుంటామని వైసీపీ నరసాపురం పార్లమెంట్ ఇంఛార్జ్ గూడూరి ఉమాబాల స్పష్టం చేశారు. ఆచంట నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు సోమవారం భీమవరంలో ఆమెను కలిసి ఇసుక మాఫియా గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ.. అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.