NDL: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి యు. నాగకార్తీక్ మెరిశాడు. అండర్-14 నుంచి 16 విభాగంలో 5వ స్థానం సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో యోగ మాస్టారు ప్రతాపరెడ్డి, ప్రధానోపాధ్యాయులు కార్తీక్ను సన్మానించి జాతీయస్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.