JGL: పింఛన్ల పెంపు కోసం మంగళవారం జరగనున్న జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, BD కార్మికులకు పెన్షన్లు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.