HYD: ఈ ఏడాది గణపయ్య.. వ్యాపారులకు కోట్ల వర్షం కురిపించారు. చిన్న,పెద్ద వ్యాపారాలకు ఈ గణపతి ఉత్సవాల వల్ల భారీగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అయితే నగరంలోని ధూల్పేటలో సుమారుగా రూ. 50 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. వినాయకుడి తయారీకి కావాల్సిన వస్తువుల నుంచి నిమజ్జనం వరకు అన్నింటి వరకు రూ. 650 కోట్లకుపైగా బిజినెస్ జరిగినట్లు సమాచారం.