KNR: మానకొండూరులో గణేష్ నిమజ్జన శోభాయాత్రను సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా సీపీ గౌస్ ఆలాం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో గణనాథులు గంగమ్మ ఒడిలోకి చేరుతున్నారు. మానకొండూరు చెరువు వద్ద శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు శుక్రవారం పర్యవేక్షించారు.