ప్రకాశం: ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు శుక్రవారం 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ దామోదర ఆదేశాల మేరకు పోలీసులు పూరి నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్ప్రెస్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వద్ద తనిఖీ చేసి 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.