NLG: చండూరు మండలం నుండి ఐదుగురు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారు. ప్రాథమిక పాఠశాలల నుండి ముగ్గురు ఝాన్సీ, నాగమణి, భద్రయ్య, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల నుండి ఇద్దరు జీవి వెంకటేశ్వరరావు, ధర్మయ్యలు శుక్రవారం నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో వారు అవార్డులను అందుకున్నారు.