ELR: పాత కక్షల విషయంలో నాగేంద్ర వరప్రసాద్‌పై పామర్తి రామచంద్రరావు, అతని మనుమడు పవన్ సాయిలు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన పెదవేగి మండలం భోగాపురంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ దాడిలో నాగేంద్ర వరప్రసాద్‌కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెదవేగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.