WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమం, ప్రస్తుతం అన్ని ప్రదేశాల్లో కొనసాగుతోంది. ఈరోజు 6 గంటల వరకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 5,639 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇందులో సెంట్రల్ జోన్ పరిధిలో 2,059, ఈస్ట్ జోన్ 1,910, వెస్ట్ పరిధిలో 1,670 గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు సమాచారం.