TG: HYDలోని బండ్లగూడ కీర్తి రిచ్ మండ్ విల్లాస్లో గణేశ్ లడ్డూ రూ.2.32కోట్ల ధర పలికిన విషయం తెలిసిందే. అయితే అందులో 80 విల్లాలు ఉన్నాయి. ఆ విల్లాల ఓనర్లు 4 గ్రూపులుగా ఏర్పడి బిడ్ తరహా వేలంలో పాల్గొంటారు. ఈ ఆక్షన్లో వచ్చిన మొత్తాన్ని ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 42 ఎన్జీవోలకు ఇస్తారు. కాగా, 2018లో రూ.25వేలతో మొదలైన ఈ లడ్డూ వేలం ఇప్పుడు రూ. 2.32కోట్లకు చేరింది.