KMM: ఖమ్మంలోని జయనగర్-పాండురంగపురం సెంటర్ వద్ద వినాయక నిమజ్జనం ఊరేగింపులో రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయకుడి ఊరేగింపులో ఉన్న జనంపైకి వేగంగా వచ్చిన ఓ కారు వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ ఆపకుండా పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.