కోనసీమ: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అమలాపురం గోదావరి భవన్లో శుక్రవారం అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. మండపేటలోని కేశవరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న చోడే కృష్ణమూర్తి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కలెక్టర్ మహేశ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా చేతుల మీదుగా అవార్డు ఆయన అందుకున్నారు.