TG: ఖైరతాబాద్ గణపతి వద్ద వెల్డింగ్ పనులు ముగిశాయి. లంబోధరుడి నుంచి క్రేన్ తొలగించారు. కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం కానుంది. మ.2 గం.ల వరకు నిమజ్జనం పూర్తి కానుంది. నిమజ్జన కార్యక్రమంలో 10లక్షల మంది భక్తులు పాల్గొనవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. 2 షిఫ్టుల్లో కలిపి 3,200 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.