VZM: పాఠాలు భోదించే ఉపాధ్యాయులు దేశానికి మార్గ దర్శకులని చీపురుపల్లి శాసన సభ్యులు,TDP పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట రావు ఉపాధ్యాయులకు కితాబిచ్చారు. విజయనగరం జిల్లాలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా వివిధ మండలాలు నుంచి ఎంపికైన ఉపాధ్యాయులకు విజయనగరంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.