RR: షాద్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన సందర్భంగా లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్‌ను కేశంపేట పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడానికి ఎమ్మెల్యే వెంకట్ రావు సుప్రీంకోర్టులో కేసును వేయడంతో పర్యటనను అడ్డుకుంటామని తెలపడంతో పోలీసులు అరెస్టు చేశారు.