NTR: నందిగామ పట్టణంలోని 6వ వార్డులో మీలాద్-ఉన్-నబీ ప్రార్థనలలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ప్రవక్త మహమ్మద్ బోధనలు ప్రేమ, కరుణ, సత్యం, సేవా భావంతో కూడిన జీవన విధానాన్ని ప్రజలకు అందించాయని పేర్కొన్నారు. మీలాద్-ఉన్-నబీ సందర్భంగా మనం ప్రవక్త బోధనలను స్మరించుకొని, సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందించే దిశగా పనిచేయాలని కోరారు.