Dalai Lama ఎంది ఇదీ..? పిల్లాడికి ముద్దు.. ఆపై నాలుక నాకాలా..? వీడియో
బౌద్ద గురువు దలైలామా పిల్లాడితో విచిత్రంగా బిహెవ్ చేశాడు. పెదవులకు ముద్దు పెట్టాడు. ఆ తర్వాత తన నాలుక తీసి.. నాకు అని కోరాడు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
Dalai Lama:బౌద్ద గురువు దలైలామా (Dalai Lama) ఓ పిల్లాడితో విచిత్రంగా బిహెవ్ చేశాడు. ఓ పిల్లాడి (chikdren) పెదవులకు ముద్దు పెట్టాడు. ఆ తర్వాత తన నాలుక తీసి.. నాకు అని కోరాడు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ (viral) అవుతుంది. దలైలామా (Dalai Lama) ఏంటీ ఇదీ అని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
వీడియోను జూస్ట్ బ్రోకర్స్ షేర్ చేశారు. ఓ పిల్లాడిని లిప్ కిస్ చేయడమే కాక.. నాలిక బయటపెట్టి నాకమని కోరడం ఏంటీ.. దీనిని ఎవరూ క్షమించరు అని పోస్ట్ చేశారు. ఇందులో ఉంది దలైలామానేనా..? (Dalai Lama) అలా అయితే అతనిని వెంటనే అరెస్ట్ (arrest) చేయాలని కోరారు.
ఇప్పుడే కాదు 2019లో కూడా దలైలామా (Dalai Lama) ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన వారసుడు మహిళ కావాలంటే ఆమె ఆకర్షించేలా ఉండాలన్నారు. మహిళా దలైలామా వస్తే తనకన్నా ఎక్కువ ఆకర్షించబడుతుందని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్లపై యావత్ ప్రపంచం స్పందించింది. ఆ ఇంటర్వ్యూ బీబీసీ పోస్ట్ చేసింది. వీడియోపై ఇంటా, బయటా విమర్శలు రావడంతో తలొగ్గి దలైలామా క్షమాపణలు చెప్పారు.
గత నెలలో దలైలామా అమెరికాలో జన్మించిన మంగొలియన్ను టిబెటన్ బౌద్దమతంలో మూడవ అత్యున్నత ర్యాంక్ 10వ ఖల్జా బెట్సన్ దంపా రింపొచేగా ప్రకటించాడు. దీనిపై చైనా ఆగ్రహాం వ్యక్తం చేసే అవకాశం ఉంది. టిబెట్లో దలైలామా తమ సొంత నిర్ణయం ప్రకటించే స్వేచ్చ ఉండటంతో ప్రకటించారు. చైనా మాత్రం ఆధిపత్యం ప్రదర్శించాలని అనుకుంటుంది.