హాయ్ హాలో మీరు మీ పిల్లలకు దోమల లిక్విడ్ బాటిల్ ఆడుకోవడం కోసం ఇస్తున్నారా? అయితే జాగ్రత్త. ఆ క్రమంలో మీ పిల్లలు వాటిని ప్రమాదవశాత్తూ నోటిలోకి తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు అది అత్యవసర పరిస్థితికి కూడా దారి తీయవచ్చు. ఇటీవల కాలంలో మస్కిటో లిక్విడ్ బాటిల్లో ద్రవ పదార్థం అనుకోకుండా తాగిన చిన్నారులు మృత్యువాత చెందిన ఘటనలు కూడా ఉన్నాయి.
అచ్చం అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ చందానగర్ పరిధిలోని తారానగర్లో చోటుచేసుకుంది. ఇంట్లో ఆడుకుంటున్న క్రమంలో ఏడాదిన్నర బాలుడు అనుకోకుండా మస్కిటో లిక్విడ్ తాగేశాడు. అంతే ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ బాలుడు అరుపులు, కేకలు వేయడం ప్రారంభించాడు. అది గమనించిన అతని తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ క్రమంలో వైద్యులు ఆ చిన్నారికి చికిత్స అందించినప్పటికీ ఆ బాలుడు మాత్రం మృత్యువాత చెందాడు. దీంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ నేపథ్యంలో మస్కిటో కాయిల్స్ లేదా సీసాల విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే దోమల మస్కిటో ద్రవ పదార్థంలో దోమలను విషర్షించే రెండు కీలక పదర్థాలు ఉంటాయని తెలుస్తోంది. వాటిలో ఒకటి పైరెథెరాయిడ్ ఇది ద్రావణంలో 1% మాత్రమే ఉంటుంది. రెండోది కిరోసిన్ ఇది 95% నుంచి 97% ఉంటుంది. పైరెథెరాయిడ్ అనేది దోమలను తిప్పికొట్టే క్రియాశీల సమ్మేళనంగా ఉపయోగపడుతుంది. కిరోసిన్ హైడ్రోకార్బన్ ఈ వికర్షకాలలో ఉయోగించే ద్రావకంగా ఉపయోగించడం వల్ల శ్వాసకోశ సమస్యలకు దారితీసే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. ఈ ద్రావణం స్వీకరించిన చాలా మందిలో ఎక్కువగా ఈ మాదిరిగానే మరణించినట్లు డాక్టర్లు చెబుతున్నారు.