Akkineni Akhil : ఇప్పటి వరకు ఓ లెక్క.. ఏజెంట్ నుంచి మరో లెక్క అనేలా.. బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. అందుకోసం చాలా సమయాన్నే తీసుకున్నాడు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు అఖిల్.
ఇప్పటి వరకు ఓ లెక్క.. ఏజెంట్ నుంచి మరో లెక్క అనేలా.. బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. అందుకోసం చాలా సమయాన్నే తీసుకున్నాడు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు అఖిల్. బాడీ బిల్డప్‌కే ఏడాది సమయాన్ని తీసుకున్నాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత ఈజీగా కంప్లీట్ అవలేదు. మధ్యలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతునే వచ్చింది. రీ షూట్లు కూడా చేశారు. దాంతో అసలు ఏజెంట్ ఇప్పట్లో రిలీజ్ అవుతుందా.. అనే డౌట్స్ వచ్చాయి. ఫైనల్‌గా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నా.. ఎక్కడో చిన్న డౌట్. సినిమా రిలీజ్‌కు ఇంకో ఇరవై రోజులే ఉంది.. అయినా ఇంకా షూటింగ్ కంప్లీట అవలేదనే ప్రచారం జరుగుతోంది. ప్రమోషన్స్ కూడా పెద్దగా స్టార్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో.. ఏజెంట్ ఈసారి రిలీజ్ అవడం కష్టమే అనుకున్నారు. కానీ బల్లగుద్ది మరీ ఏప్రిల్ 28న వస్తున్నామని చెబుతూ.. పుకార్లకు చెక్ పెట్టాడు అఖిల్. ఇప్పటికే అఖిల్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిపోయాడు. ముందుగా యాంకర్ సుమతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాడు. ఇప్పటి నుంచి అఖిల్ పాన్ లెవల్లో భారీగా ప్రమోషన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దసరా సినిమా కోసం నాని దేశమంతా ఎలా తిరిగాడో.. అఖిల్ కూడా ఇండియాను చుట్టేయబోతున్నాడు. ఇప్పటికే ఏజెంట్ టీజర్, సాంగ్స్ అంచనాలను పెంచేశాయి. అయినా కూడా ఏజెంట్ మరింత బజ్ క్రియేట్ చేయాల్సిందే. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా సాలిడ్ యాక్షన్ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు. మొత్తంగా ఈసారి ఏజెంట్ మిషన్ థియేటర్లోకి రావడం పక్కా అని చెప్పొచ్చు.