ప్రకాశం: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల పొదిలిలోని పొగాకు రైతులను పరామర్శించిన పర్యటనలో జరిగిన రాళ్ల దాడి కేసులో వైసీపీ కార్యకర్తలకు సోమవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 40 రోజులకు పైగా రాళ్లదాడి కేసులో వారు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారికి ఊరట లభించింది.