NGKL: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు సాధించేవరకు ఉద్యమం ఆగదని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో జర్నలిస్టులు చేస్తున్న దీక్షలకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హక్కుల సాధన కోసం శాంతియుతంగా దీక్షలు చేస్తున్న జర్నలిస్టులను అరెస్టు చేయడం దారుణం అన్నారు.