KRNL: దేవనకొండ మండలం కుంకనూరులో అంగన్వాడీ కేంద్రం – 2 వద్ద చిన్నపాటి వర్షానికే మురుగునీరు నిలుస్తోందని కాలనీవాసులు తెలిపారు. వీధిలో సీసీ రోడ్లు, కాలువలు లేకపోవడంతో మురుగు నిల్వ ఉండి దుర్వాసనతో పాటు, దోమలు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు స్పందించి సీసీ రోడ్డుతో పాటు మురుగు కాలువలు నిర్మించాలన్నారు.