KRNL: ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా కలిసి ముందుకు రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ నగర పాలక కార్యాలయంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శన, ప్లాస్టిక్ వ్యర్థాలకు పునరుత్పాదక వస్తువుల అందజేత కేంద్రాలను కమిషనర్ ప్రారంభించారు.