E.G: గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం తాళ్లపూడిలో ట్యాంక్, సీసీ రోడ్లు నిర్మాణానికి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ట్యాంక్ నిర్మాణానికి రూ.31.60 లక్షలు, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.55 మంజూరు అయినట్లు వారు వెల్లడించారు.