E.G: సీతానగరం మండలం ఇనగంటివారిపేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ శ్రేణులు శుక్రవారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనలోకి చేరినట్లు తెలిపారు.