ప్రకాశం: మార్కాపురంలోని సుందరయ్య కాలనీలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు. అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ మాట్లాడుతూ.. కాలనీ ఏర్పడి 24 సంవత్సరాలు అయిన ఇప్పటికీ సరైన రోడ్డు లేవని, తాగునీటి వసతి లేదని ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.