విషం కలిపిన నీళ్లు తాగి రష్యాకు చెందిన నలుగురు సైనికులు మృతిచెందారు. మరికొంతమంది సిబ్బంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రష్యా ఆక్రమిత డొనెట్స్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వాటర్ బాటిళ్లను ఎవరు పంపారు? జవాన్ల చేతికి ఎలా వచ్చాయి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి.