ELR: కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలు కాపాడాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని మాదేపల్లి, కాట్లంపూడి, లింగారావుగూడెం గ్రామాల్లో పర్యటించి ఎండిపోతున్న నారుమళ్లను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. కృష్ణా డెల్టా పరిధిలో వేలాది ఎకరాలకు సాగు నీరు లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.