GNTR: తెనాలిలో రావిసాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో NCC శిక్షణ పొందేందుకు శుక్రవారం 8, 9వ తరగతి నుంచి విద్యార్థుల ఎంపికలు నిర్వహించారు.130 మంది విద్యార్థులు ఆసక్తి చూపగా వారికి వివిధ పోటీలు నిర్వహించి 81 మందిని ఎంపిక చేశారు. NCC శిక్షణ ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని HM భారతి చెప్పారు. ఉద్యోగాలలో వీరికి రిజర్వేషన్ ఉంటుందని కేర్‌టేకర్ గోవర్ధన తెలిపారు.