NDL: నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం. ఈ నెల 21వ తేదీ ఆత్మకూరు బస్టాండు దగ్గర ఉన్న ఎన్టీఆర్ షాదికానా నందు ఉదయం 9 గంటలకు మోగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ తెలిపారు. ఇవాళ నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు.