ASR: పెదబయలు మండలంలోని గుల్లేలు పంచాయతీ పరిధి మూలగరువు గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. గ్రామంలోని సరైన తాగునీటి సౌకర్యం లేక కిలోమీటరు దూరంలోని ఊట నీటిని తెచ్చుకొని అవసరాలకు వినియోగించుకుంటున్నారు. తద్వారా పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలంటున్నారు.