VZM: ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా లేకనే మూడు పార్టీలు ఏకమై జగన్ను ఓడించాయని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మోపాడ, గొలగాం, అక్కివరం గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. నాటి జగన్ హయాంలో స్మార్ట్ మీటర్లు, భూ సర్వేలపై రాద్దాంతం చేసి ప్రయోజనం పొందారని, నేడు వాటినే కొనసాగిస్తున్నారన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే ప్రజాబలం తెలుస్తుందన్నారు.