SRPT: నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం కొండాయిగూడెంలో నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రైతులు నార్లు పోసుకొని నాటుకు సిద్ధంగా ఉన్నారని, నీళ్లు లేక సాగర్ నీటి కోసం రైతాంగం ఎదురుచూస్తుందని పేర్కొన్నారు.