AKP: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ సూచించారు. గురువారం సాయంత్రం అనకాపల్లి కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిమ్న జాతి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు పూర్తిస్థాయిలో అందేలా బాధ్యత తీసుకోవాలన్నారు.