ASR: గిరిజన రైతుల అభివృద్ధికి మేధో మధనం చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ అన్నారు. ఏజెన్సీలో సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి ప్రణాళికలు చేయాలని అయన సూచించారు. గురువారం అరకులోయ పద్మాపురం గార్డెన్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడారు. కాఫీ, మిరియాలు, పసుపు, అల్లం పంటల గురించి కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు.