SKLM: నరసన్నపేటలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని స్థానికులు వాపోతున్నారు. నేతాజీ వీధి వద్ద చెత్తతో నిండిపోయి అపరిశుభ్రంగా ఉందని ఆరోపిస్తున్నారు. దీంతో భరించరాని దుర్గంధం వెదజల్లుతోందని మండిపడ్డారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.