VZM: కడపలో ఆదివారం జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో బొబ్బిలి పట్టణం స్థానిక అరుగువీధికి చెందిన రమేష్ తన ప్రతిభ కనబరిచాడు. ఈ పోటీల్లో పాల్గొన్న రమేష్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల ఢిల్లీలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో రెండు పతకాలు సాధించాడు. రమేష్ సాధించిన విజయానికి జిల్లాలోని పలువురు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.