KKD: జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల మేరకు యానం సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు సోమవారం ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఇతర జిల్లాలకు పెట్రోల్, డీజిల్, మద్యం వంటి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి మల్లవరం వద్ద యానాం- కాకినాడ రోడ్‌పై చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. వారు పట్టుకున్న అక్రమ రవాణాపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.