KMM: సీపీఐ సత్తుపల్లి మండల కార్యదర్శిగా తడికమళ్ల యోబును ఎన్నుకున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ తెలిపారు. సీపీఐ సత్తుపల్లి మండల మహాసభ గంగారంలో నిర్వహించగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. 15 మంది కౌన్సిల్ సభ్యులతో 9 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. మహాసభలో జిల్లా కార్యవర్గ సభ్యులు సింగు నర్సింహారావు ఉన్నారు.